Haryana Assembly Election 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
కాగా, జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరిగింది. అయితే ఈ నెల 8న ఓట్లను లెక్కించి ఇరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు.