PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 9.4 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు వారి ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులు జమకానున్నాయి. నమో శేట్కారీ మహాసన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులు అదనంగా మరో రూ.రెండు వేల కోట్లు పొందనున్నారు. కాగా, పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ పర్ స్కీంగా మారింది.