Trending Now

Actor Nagarjuna: టాలీవుడ్ హీరో నాగార్జునకు బిగ్ షాక్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Big Shock To Nagarjuna case filed: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆయన ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. హీరో నాగ చైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆరే కారణమంటూ సురేఖ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Spread the love

Related News

Latest News