Trending Now

Nirmal: విజయదశమి ఏర్పాట్లను పరిశీలన నిర్మల్ ఎమ్మెల్యే!

Nirmal MLA inspecting Vijayadashami arrangements: విజయదశమి వేడుకలను పురస్కరికొని నిర్మల్ శాసనసభ్యులు, బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట ప్రాంతంలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, విశ్వనాథ్ పేట ప్రాంతంలో గల శ్రీ నంది గుండం దుర్గామాత ఆలయం, సారంగాపూర్ మండలం అడెల్లిలో గల శ్రీ మహా అడెల్లి పోచమ్మ ఆలయాలను ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా నిర్వహించే విజయదశమి వేడుకల నిర్వహణ తీరుతెనులపై సంబంధిత శాఖల అధికారులతో పలు విషయాలు చర్చించారు. విజయదశమి వేడుకల సందర్భంగా నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట శ్రీ మహా లక్ష్మీ ఆలయ పరిసరాలలో కి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిస్థాయి మౌలిక వలసతుల కల్పనా తో పాటు పోలీస్ బందోబస్తు తదితర విషయాలపై ఆరా తీశారు.

ఆలయాలకు చేరుకున్న శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి అర్చకులు ఆలయ కమిటీ బాధ్యతలు సాంప్రదాయ పద్ధతులలో స్వాగతం పలికి శాలువలు,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విజయదశమి వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేలా పక్క ప్రణాళిక రూపొందించుకొని ఏర్పాట్లను చేయాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ సీవీఎన్ రాజు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ లకు ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మరాజు, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, ఆయిండ్ల భూపాల్ రెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ కుమార్, ఏడిపల్లి నరేందర్, పద్మాకర్, మహాలక్ష్మి ఆలయ కమిటీ పూజారి కుడుకల రమేష్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News