Trending Now

India vs Bangladesh: బంగ్లాదేశ్‌ ఆలౌట్‌.. భారత్‌ లక్ష్యం 128

India vs Bangladesh 1st T20: భారత్, బంగ్లాదేశ్‌ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్‌ వేదికగా జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో మెహిదీ హసన్ మిరాజ్ (35*), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27) ఫర్వాలేదనిపించాడు. తౌహిద్ హృదయ్ (12), రిషాద్‌ హొస్సేన్ (11) పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌, నితీశ్‌ తలో వికెట్‌ తీశారు.

Spread the love

Related News

Latest News