Trending Now

Jayasuriya: శ్రీలంక హెడ్ కోచ్‌గా జయసూర్య

Jayasuriya appointed full-time head coach of Sri Lanka: శ్రీలంక క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలంక బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా తాత్కాలిక కోచ్‌గా సేవలు అందిస్తుండగా.. జట్టు మంచి ఫలితాలను రాబట్టింది. న్యూజిలాండ్‌ను 2-0 తేడాతో ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి మరింత చేరువ అయింది. జట్టు ఫర్ఫామెన్స్ అనుకున్న దాని కంటే మెరుగ్గా ఉండడంతో ఆయనకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ వెటరన్ క్రికెటర్ 2026 మార్చి వరకు పదవిలో కొనసాగుతారని లంక బోర్డు తెలిపింది. శ్రీలంక తరపున ఈ వెటరన్.. 1991 నుంచి 2007 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 110 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40.07 సగటుతో 6,973 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 445 వన్డేల్లో 28 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 13 వేలకు పైగా పరుగులు చేశాడు.

Spread the love

Related News

Latest News