India vs Bangladesh: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే ఆస్కారముంది.