Trending Now

రంజాన్ కు ఎస్ఐఓ స్వాగతం..

ప్రతిపక్షం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి 26 వరకు ‘రంజాన్‌కు స్వాగతం’అనే అంశంపై విద్యార్థులు, యువత కోసం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ) ఆత్మీయ సభలను నిర్వహించింది. రంజాన్‌ నెల ఉపవాసాలకు, ప్రార్థనలకు సిద్ధమయ్యేలా యువతకు మార్గనిర్దేశం చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం ఈ సభల ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాలలో రంజాన్ ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఆచరణాత్మక మార్గాలపై ఉపన్యాసాలు, చర్చలు నిర్వహించారు. ప్రతి ముఖ్యమైన సందర్భంలో విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఎస్ఐఓ పని చేస్తున్నది. ఈ సందర్భంగా ‘రంజాన్ పవిత్ర మాసానికి తమను తాము ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకోండి’ఎస్ఐఓ తెలంగాణ అధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్ పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News