Trending Now

Elections: ఎన్నికల నగారా.. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

Maharashtra, Jharkhand Assembly Polls Schedule To Be Out: మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈసీ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో, ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్‌ 20న పోలింగ్‌, ఝార్ఖండ్‌లో నవంబర్‌ 13, 20 తేదీల్లో ఉండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 23న ఉండనుందన్నారు.

Spread the love

Related News

Latest News