2 ITBP jawans killed in IED blast in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. నారాయణ్‌పూర్‌లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు అమరులయ్యారు. శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఐటీబీపీ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో అప్పటికే ఆ ప్రాంతంలో ఐఈడీ బాంబును ఏర్పాటు చేసిన మావోయిస్టులు దాన్ని పేల్చేశారు. ఈ విషాద ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు నారాయణ్‌పూర్ జిల్లా పోలీసులు తెలిపారు. స్థానిక ధుర్బేద ప్రాంతంలో కూంబింగ్ కోసం ఐటీబీపీ, జిల్లా రిజర్వు గార్డ్ బలగాలు వెళ్తున్న సమయంలో కొడ్లియార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీలోని కడపకు చెందిన కె .రాజేశ్ అనే జవాను ఉన్నట్లు తెలుస్తోంది.