Six workers, doctor killed in terrorist attack in Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందారు. ఈ దాడిలో మరో అయిదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణపనులు చేస్తున్న ప్రైవేటు కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసింది. అయితే కార్మికులు, సిబ్బంది పనులు ముగించుకొని తమ ఇళ్లకు తిరిగి వస్తుండగా.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు జరిపారు. దీంతో ఓ వైద్యుడితోపాటు ఆరుగురు కార్మికులు మృతిచెందారు. పోలీసు బలగాలు, సైనిక దళాలు ముష్కరుల గాలింపునకు చర్యలు చేపట్టాయి. కశ్మీర్ పోలీస్ ఐజీ వి.కె.బిర్ది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దాడి పిరికిచర్య అంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు.