India vs New Zealand second test: పుణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 156 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ మరోసారి అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో 301 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్ కెప్టెన్ లాథమ్(133 బంతుల్లో 10 ఫోర్లతో 86) పరుగులతో రాణించగా.. విల్ యంగ్ (23), డేరియల్ మిచెల్ (18) పరుగులు చేశారు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్ (9), టామ్ బ్లండెల్ (30) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పడగొట్టాడు. అశ్విన్ ఒక వికెట్ తీశాడు.