Trending Now

Municipal Commissioner: నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు బదిలీ

ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలక వ్యవహారాల శాఖ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులను జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సీవీఎన్ రాజు పనిచేశారు. అయితే ఆదిలాబాద్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్న ఎండీ ఖమర్‌ను నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ఆ శాఖ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. సీబీఎన్ రాజును అదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.

Spread the love

Related News

Latest News