Petrol Bunk Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. నాచారంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పడుతుండగా.. గంజాయి మత్తులో యువకులు నిప్పు పట్టారు. దీంతో ఒక్కపారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది పరుగులు తీశారు. అనంతరం సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వివరాల ప్రకారం.. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో వాహనాలకు పెట్రోల్ పడుతున్నాడు. ఈ సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఆకతాయిలు ఒక్కసారిగా జేబులోకి లైటర్ తీసి నిప్పుపెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాకయ్యారు. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిప్పు పెట్టిన యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.