Massive Fire Accident in Jangaon: జనగామ జిల్లాలో రెండు షాపింగ్‌మాల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు ఉన్న విజయ, శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణాల్లో ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.



























