Trending Now

Revenue department: రెవెన్యూ శాఖలో బదిలీలు.. ఒకే రోజు 70 మంది

Transfer in Revenue department: రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు జరగడం సంచలనంగా మారింది. ఒకేరోజు దాదాపు 70 మంది బదిలీ అయ్యారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి బర్త్ డే రోజే జరగడం గమనార్హం. వెయిటింగ్‌లో ఉన్న పది మంది ఆర్డీఓలకు పోస్టింగ్స్ లభించాయి. డిప్యూటీ కలెక్టర్లు ఎల్.రమేష్, ఎన్.ఆనంద్ కుమార్, వి.హనుమ నాయక్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిని రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి పొంగులేటి భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ భారీ బదిలీలు జరిగాయని తెలుస్తోంది.

Spread the love

Related News