ప్రతిపక్షం, తెలంగాణ: రోడ్డు దాటుతుండగా ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో అర్లి(కే) గ్రామానికి చెందిన సుధాకర్.. భైంసా సబ్ స్టేషన్లో పని చేస్తుండగా.. పని నిమిత్తం మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన అతడిని నిర్మల్ వైపు వెళ్తున్న బొలేరో ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.