ట్రస్మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2024 ను ప్రారంభించిన నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కుచాడీ శ్రీ హరి రావు
ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్, నవంబర్ 30 :
పాఠశాల స్థాయి విద్యార్థి దశ నుంచే విద్య వైజ్ఞానిక రంగాలతో పాటు క్రీడా రంగాలలో కూడా రాణించేందుకు భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని కష్టపడాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ట్రస్మా ఆధ్వర్యంలో ట్రస్మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2024 ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఆధారంగానే కాలాతీత రంగాలలో రాణించేందుకు కష్టపడాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఉన్న సౌకర్యాలు గతంలో ఎక్కడ కూడా కనిపించేది కావని ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా గురువుల బోధనాలను అనుసరిస్తూ ఉన్నత శిఖీరాలను అధిరోహించేందుకు పోటీపడుతూ ముందుకెళ్లాలన్నారు.మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా ప్రాంతాలలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇతరత్రా సమస్యలను గుర్తించి ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని ఆస్థాయి సౌకర్యాలను కల్పిస్తూ ఆయా క్రీడలలో రాణించేందుకు తగిన విధంగా ప్రోత్సాహాలను అందిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను ఆయా రంగాలలో రాణించేలా తగ్గిన విధంగా వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలతో ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు క్రీడ రంగంలో రాణించడం వల్ల భవిష్యత్తులో ఉన్నత విద్య,ఉద్యోగ విషయాలలో క్రీడా కోట చాలా ఉపయోగపడుతుందన్నారు క్రీడల వల్ల విద్యార్థిని విద్యార్థులు మానసిక ఉల్లాసంగా, శారీరకంగా ఎంతో ఉపయోగపడుతుందని అలాగే ఆరోగ్యవంతంగా ఉంటారని ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పంతికే శ్రీనివాస్, మహమ్మద్ అన్వర్ పాషా, నాయకులు కొంతం గణేష్, మారుతి, ప్రమోద్ రావు,జాదవ్ రమేష్ ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.