ప్రతిపక్షం ప్రతినిధి భూపాలపల్లి జనవరి 08: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని నిర్మిస్తున్న చిన్న కాలేశ్వరం కెనాల్ పనుల్లో భాగంగా భూ నిర్వాసితుల్లో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు వివరాలకు వెళితే మండల కేంద్రంలోని ఎల్కేశ్వరం గ్రామంమానికి చెందిన రైతు రాళ్లబండి మల్లయ్య భార్య రాళ్లబండి కమల తమ భూముల నుండి కెనాల్ వెళ్తుండడంతో తమకు నష్టపరిహారం ఇవ్వకుండా పోలీసులను పెట్టి పనులు చేపడుతున్నారని, నాలుగు రోజుల నుంచి అడ్డుకుంటున్న పట్టించుకునే వారు లేరని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. బంధువులు 108 కు సమాచారం ఇవ్వడం తో మహాదేవపూర్ ఆసుపత్రి కి తరలించారు ప్రథమ చికత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ తరలించారు.