Trending Now

కర్రె గుట్టల్లో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మృతి

28 మంది మృతి
ప్రతిపక్షం ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దు కర్రెగుట్టల్లో తుపాకుల మోత మోగింది.. మావోయిస్టలే లక్ష్యంగా గత ఐదురోజులుగా దాదాపు 20 వేల మంది కేంద్ర బలగాలు కర్రెగుట్టలను చుట్టు ముట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్​కౌంటర్​ జరిగినట్టు తెలుస్తోంది. భద్రతా దళాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.


‘కరిగుట్టలలో’ యుద్ధ మేఘాలు
ముందుకు సాగుతున్న కేంద్ర బలగాలు
భారీగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు

దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్‌లో వాయుసేన వేగాన్ని పెంచింది. ఆపరేషన్ ‘కగార్’ తుది దశకు చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ–ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంపై భద్రతా దళాలు పట్టు సాధిస్తున్నాయి. గత రెండు రోజులుగా పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో భారీ ఎదురు కాల్పులు కొనసాగాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతులలో నలుగురు మహిళా మావోయిస్టులను గుర్తించారు. మృతులంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మాకు చెందిన గెరిల్లా దళ సభ్యులని అంటున్నారు. భద్రత బలగాలు మావోయిస్టుల డంపులను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి. కర్రెగుట్టలలో సాయుధ బలగాలు మూడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయని సమాచారం. అయితే, వెంకటాపురం వైపు కూంబింగ్ కు ఎండ తీవ్రత అడ్డంకిగా మారింది. ఎండల తీవ్రతకు 21మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. అందులో15మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని హెలికాప్టర్ లో వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్రెగుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, సెర్చింగ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ మావోయిస్టు పార్టీ నేతలు రాసిన లేఖను కేంద్రం పక్కకు పడేసిందని తెలుస్తోంది. అయితే, కరిగుట్టల చుట్టూ భద్రతా బలగాలు మోహరించడంతో కొంచెం గందరగోళ వాతావరణం నెలకొంది. ఎదురు కాల్పులలో మావోయిస్టులు మృతిచెందారా? లేదా? అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Spread the love

Related News