Trending Now

కెన్యాలో విమాన ప్రమాదం


12 మంది ప్రయాణికులు మృతి


ప్రతిపక్షం, నేషనల్​ డెస్క్:
కెన్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మంగళవారం ఉదయం కెన్యాలోని క్వాలే కౌంటీలో చిన్న విమానం కూలిపోవడంతో 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మాసాయి మారలోని కిచ్వా టెంబోకు పర్యాటకులను తీసుకెళ్తున్న విమానం, డయాని నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని కెన్యా పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది. ప్రమాదం ఉదయం 5:30 గంటలకు సంభవించినట్లు అథారిటీ తెలిపింది. కెన్యా టైమ్స్ నివేదిక ప్రకారం విమానంలో ఉన్న 12 మంది ప్రయాణికులలో అందరూ చనిపోయారని తెలుస్తోంది. ప్రమాద ఘటన స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News