నివాళులర్పించిన నేతలు
ప్రతిపక్షం స్టేట్బ్యూరో, హైదరాబాద్, అక్టోబర్28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందారు. హైదరాబాద్‌లోని హరీష్‌రావు నివాసంలో సత్యనారాయణ పార్థీవ దేహాన్ని ఉంచారు. కేసీఆర్, కేటీఆర్ తో సహా భారత రాష్ట్ర సమితి నేతలు సత్యనారాయణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రావును, తన సోదరిని ఓదార్చిన కేసీఆర్తన బావ సత్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఫిలింనగర్మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జగదీశ్వర్‌రెడ్డి, సంతోష్, పాడి కౌశిక్‌రెడ్డి, బాల్క సుమన్, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావు గౌడ్, దేవపతి శ్రీనివాస్, దాస్యం వినయ్‌భాస్కర్, మధుసుదనాచారి, రాకేష్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వద్దిరాజు రవించంద్ర, బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు వివేక్‌వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు సత్యనారాయణ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. కాగా కేసీఆర్కుటుంబమంతా ఉదయం నుంచే హరీశ్ ఇంటి వద్ద చేరుకున్నారు. స్వయంగా తన మామ అయిన సత్యనారాయణ అంత్యక్రియలకు కవిత దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.

































