ఏం తమాషా చేస్తున్నారా?
రోడ్డు పక్క మసీదులను వదిలేస్తారా?
రోడ్డు పక్క మసీదులను మేం కూల్చేస్తాం ?
రామగుండంలో రగులుతున్న ఉద్రిక్తత!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ రచ్చ
త్వరగా పునర్నిర్మించకపోతే నేనే వస్తా?
బండి సంజయ్ ఫోన్ హెచ్చరిక
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, నవంబర్ 08:
ఎంటీ.. కలెక్టర్ గారూ.. కమిషనర్ గారూ ఇదేంటీ..? అసలు ఏం చేస్తున్నారు. 46 మైసమ్మ ఆలయాల్ని కూల్చేస్తారా ..? రోడ్డు పక్క మసీదులను వదిలేస్తారా..? త్వరగా పునర్నిర్మించకపోతే నేనే వస్తా? జూబ్లీ ఉప ఎన్నికల తర్వాత నేనే స్వయంగా గోదావరిఖనికి వస్తా.. ఏం చేయాలో చేస్తా..? వెంటనే కూల్చి వేసిన ‘46 మైసమ్మ ఆలయాల్ని వెంటనే పునర్మించండీ..లేదంటే చర్యలు తప్పవు అని కేంద్ర హోంశాఖ మంత్రి ‘బండి సంజయ్ పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కార్ఫోరేషన్ కమీషనర్లకు ఫోన్ చేసి హెచ్చరిక జారీ చేశారు. దీంతో రామగుండంలో ఆలయాల వివాదంపై ఉద్రిక్తత!’’నెలకొంది.
తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తమవుతోంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేడి ఇంకా చల్లారకముందే, రాష్ట్రంలో మరో రాజకీయ వివాదం చెలరేగింది. కేంద్ర నేత బండి సంజయ్ కుమార్ తాజాగా పెద్దపల్లి జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా ఆగ్రహం వ్యక్తం తీరు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. ఉమ్మడి కరీంనగర్ లోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తాజాగా 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి ఆలయాలను కూల్చివేయడంపై మండిపడ్డారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని విస్తరణలో భాగంగా కూల్చివేశామంటూ అధికారులు చెప్పడంతో ‘‘రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి వాటిని ఎందుకు కూల్చివేయలేదు’’అని ప్రశ్నించారు. దీనిపై అధికారులు నీళ్లు నమలడంతో ‘‘ఏం తమాషా చేస్తున్నారా? ఎవరి మెప్పు కోసం మూకుమ్మడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారు? ఆటోడ్రైవర్ల అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారు. భక్తులు నిత్యం దర్శించుకుంటారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తారా? భక్తుల మనోభావాలు పట్టవా? పోనీ అదే రోడ్డుకు అడ్డంగా అక్కడ మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి వాటినెందుకు కూల్చివేయలేదు? హిందువులంటే అంత చులకనా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు 48 గంటలు టైమిస్తున్నా. కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునరుద్దరించాలి. లేకపోతే దారికి అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలి. లేనిపక్షంలో నేను గోదావరికి వస్తా. దగ్గరుండి మసీదులన్నింటినీ కూల్చివేయిస్తా. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయిన వెంటనే గోదావరిఖని వస్తా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోసహా అధికారులందరినీ ప్రజల మందు నిలబెడతా. జరగబోయే పరిణామాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.’’అని హెచ్చరించారు.




























