రూ.1200 కోట్లు విడుదల’కు ఓకే
తక్షణమే రూ. 600 కోట్లు
త్వరలో మరో రూ.300 కోట్ల చెల్లింంపు కు హామీ
దసరా ముందే రూ. 300 కోట్లు విడుదల
రేపటి నుండి కళాశాలు రీ ఓపెన్
(వడ్లకొండ సదానందం)
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, నవంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం, ప్రయివేట్ కళాశాల యాజమాన్యాల మధ్య తాజాగా జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. మొత్తం బకాయి రియాంబర్స్మెంట్స్, స్కాలర్ షిఫ్ కలిపి రూ 1200 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉండగా అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఇందులో దసరా ముందు రూ. 300 కోట్లు చెల్లింపులు చేసింది. ఇంకా రూ. 900 కోట్లు పెండింగ్ బిల్లులు బకాయి లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం తో జరిగిన చర్చల్లో తక్షణమే రూ. 600 కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం. చేసింది. మిగిలిన మరో రూ. 300 కోట్లు త్వరలో చెల్లిస్తామని హామీ ఇవ్వడం తో చర్చలు సఫలం అయ్యాయి. దీంతో రేపు సోమవారం నుండి తిరిగి ప్రయివేట్ కళాశాలలు తెరుసుకొనున్నాయి. పెండింగ్ రియాంబర్స్మెంట్స్, స్కాలర్ షిఫ్ కోసం ప్రవేట్ కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేశాయి. విద్యార్థులు ఆందోళన చెందుతున్న తరణంలో ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చర్చలు సఫలం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మరో రూ.300 కోట్లను త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఈనెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కళాశాలల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు యథావిధిగా సోమవారం నుండి తెరుచుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్టుగా ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేటు కళాశాలలు ఫీజు బకాయిలు చెల్లింపునకు సర్కారు అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మరో రూ.300 కోట్లను త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. గతంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఈనెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కళాశాలల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు యథావిధిగా సోమవారం నుండి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎంతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లుగా ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేటు కళాశాలల బంద్‌పై సీఎం స్పందన :ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. విడతల వారీగా బకాయిలను చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాం లోని బకాయిలను ముందు గా చెల్లిస్తామని ఆయన వివరించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడొద్దని హితవు పలికారు. బకాయిలు ఇవాళ కాకపోతే రేపు వసూలవుతాయన్నా రు.కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించా రు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదని ఆయన వివరించారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.

ప్రస్తుతానికి సంతోషం
ప్రభుత్వం 600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం ప్రస్తుతానికి సంతోషంగానే ఉన్నా కూడా మిగిలిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తే, డిగ్రీ పీజీ కళాశాలలు బ్రతుకుతాయి. డిగ్రీ పీజీ కళాశాలలు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే 4 సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ రాని కారణంగా కళాశాలల యాజమాన్యాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించి కళాశాలలను ఆదుకోవాలి.
– గోవిందవరం కృష్ణ, శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ యాజమాన్య సంఘం, కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు



























