ప్రతిపక్షం, హైదరాబాద్
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రస్తుతం యూసఫ్ గూడ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి దాదాపు 10 వేలకు పైగా ఓట్ల మెజారిటీలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి రౌండ్లో కాంగ్రెస్ కు 47 ఓట్ల స్వల్ప మెజార్టీ రాగా… రెండో రౌండ్‌కు వచ్చేసరికి కాంగ్రెస్ మెజారిటీ 3 వేలకు చేరింది. మూడో రౌండ్ కు చేరుకునే సరికి కాంగ్రెస్ ఆధిక్యం 5044 ఓట్లకు చేరింది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 9,147 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.


























