ప్రతిపక్షం, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలపై నమ్మకం వల్లే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడుతున్నారని ఆయన అన్నారు. ప్రతి రౌండ్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అభివృద్ధి , సంక్షేమం ముందు బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు విఫలమయ్యాయన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతోనే రిగ్గింగ్ ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయినా ప్రజలు కాంగ్రెస్ ప్రజా పాలన వైపే మొగ్గుచూపారని అన్నారు. బీఆర్ఎస్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.



























