ప్రతిపక్షం, నేషనల్: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్‌కు సుఖ్వీందర్ సింగ్ పంపారు. అయితే గవర్నర్ కు సీఎం లేఖ పంపలేదని తెలిసింది. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
హిమాచల్‌లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం సుఖు పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ అగ్రనేతలు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో కాంగ్రెస్ నాయకత్వం చర్యకు దిగింది.