అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్
ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు బండారి శేఖర్ ఫిర్యాదు
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్ నవంబర్ 17: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గతంలో పని చేసిన ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ రావును అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశం పై తాజాగా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు బండారి శేఖర్ ఉన్నతాది కారులకు ప్రజవాణిలో ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాలో స్టడీ సెంటర్ లకు పీసీపీ స్టడీ సెంటర్ క్లాసుల నిర్వాహణ కోసం వచ్చిన డబ్బులపై 2021 నుండి 2025 వరకు కోటి రూపాయలకు పైగా అవినీతికి పలుపడ్డ నాగేశ్వర్ రావు పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ 180 ఓపెన్ స్కూళ్ల నుండి ఒక్క అడ్మిషన్కు రూ. 100/- ల నుండి రూ. 200/- ల వరకు తీసుకున్న దానిపై విచారణ చేయాలి, ఓపెన్ స్కూల్లకు బుక్స్ పంపిణి చేయకుండా అమ్ముకున్న దానిపై విటన్నిటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ 2021 నుండి 2025 ఆగస్టు వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాగా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా పనిచేసిన నాగేశ్వరరావు ప్రభుత్వ, ప్రైవేటు ఓపెన్ స్కూల్ల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వాసులు చేసాడని ఆరోపించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 180 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉంటే ఇందులో 160 స్టడీ సెంటర్లలో పీసీపీ క్లాసులు నిర్వాహించారు. ఈ నిర్వాహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి స్టడీ సెంటర్ కు 30వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేసిన నాగేశ్వర్ రావు ప్రతి ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నుండి 30వేల రూపాయలలో 40% (12 వేలు) ఇచ్చి నాగేశ్వరావు 60% (18 వేలు) తీసుకున్నాడని అన్నారు. ప్రతి సంవత్సరం రూ. 21,60,000/- లు స్టడీ సెంటర్ల మీద అవినీతి చేసాడని అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నుండి ఒక్క అడ్మిషనుకు రూ.100/- లు, ప్రైవేటు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ల నుండి ఒక్క అడ్మిషనుకు రూ.200/- లు వసూలు చేసారని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఏ ఒక్క ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్కి పూర్తి స్థాయిలో బుక్స్ ఇవ్వకుండా అమ్ముకున్నాడని అన్నారు. గతంలో, ఇప్పుడు పనిచేస్తున్న ప్రైవేట్, ప్రభుత్వ ఓపెన్ స్కూల్స్ కో-ఆర్డినేటర్ను పిలిచి ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు నాగేశ్వర్ రావు గురించి అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు. దీనిపై ఉమ్మడి జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో జిల్లాలో విస్తృతంగా ప్లాట్లు, ఇండ్లు, భూములు కొన్నారని ఆరోపించారు. ఇతనిపై ఇన్కమ్ టాక్స్, ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తక్షణమే నాగేశ్వరావు ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.



























