Trending Now

వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు

  • గందరగోళంలో ఆలయ ఉద్యోగులు
  • 17 మంది ఉద్యోగులను బదిలీ చేసిన ఈఓ

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్ నవంబర్ 20:

ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపర్డెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, ఒకరు రికార్డ్ అసిస్టెంట్, మరొకరు అటెండర్ ఏవో రమాదేవి అంతర్గత బదిలీ చేశారు.బదిలీ అయిన ఉద్యోగులు వారి వారి స్థానాల్లో చార్జీలు తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న ఆలయ ఈవో రమాదేవి హెచ్చరించారు. సెంట్రల్ గోదాం సూపర్డెంట్ గా పనిచేసిన వెంకట ప్రసాద్ రాజు ను బదిలీ చేసి అదే ప్లేస్ లో సూపర్డెంట్ సంతోష్ కు ఇచ్చారు. మూడు రోజుల్లో సెంట్రల్ గోదాం లో ఉన్న సరుకులను వెచ్చించి సంతోష్ కు చార్జ్ ఇవ్వాలని వెంకటప్రసాద్ రాజును ఈవో ఆదేశించారు.

  • కారణం ఇదేనా..?*
    వేములవాడ పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్(25) అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందారు.రెండవ బైపాస్ రహదారిలోని బుధవారం అర్ధరాత్రి మురికి కాల్వలో పడి మృతి చెందినట్లుగా సమాచారం మృతుడు బద్ది పోచమ్మ ఆలయంలో దినసరి కార్మికుడిగా కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇటీవలే రాజన్న ఆలయంలో ఆలయ గోదాం నుండి సరుకులను సదరు విభాగం పర్యవేక్షకుడి వాహనంలోకి తరలించారు. గోదాం సరుకుల తరలింపు వ్యవహారంలో ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతుండగా తరలించిన వ్యక్తి ఆకస్మిక మృతిపై అనుమానాలు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ బదిలీ లు జరిగి ఉండవచ్చని పలువురు బావిస్తున్నారు.
Spread the love

Related News