ప్రతిపక్షం, తెలంగాణ: బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు కోటిగుడ్లతో దాడికి యత్నించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోకి యాత్ర ఎంటర్ కాగానే కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. కోడిగుడ్లు యాత్రను కవర్ చేస్తున్న మీడియా చానల్స్, కెమెరాలపై పడి పగిలిపోయాయి. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పరారీ అయ్యారు.
ఈ దాడిపై బండి సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు.