ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. ఇందులో ఎస్జీటీలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, లాంగ్వేజ్ పండిత్ 727, పీఈటీలు 182, స్పెషల్ కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.
పాత పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. పాత 5,089 పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులను ప్రభుత్వం జోడించింది. ఇక, మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఆన్ లైన్‌లో డీఎస్సీ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.