Trending Now

మిస్ ఇండియా ఫైనలిస్ట్ రింకీ మృతి..

ప్రతిపక్షం, సినిమా: ప్రముఖ ఫెమీనా మిస్​ఇండియా ఫైనలిస్ట్ త్రిపురకు చెందిన రింకీ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యానర్స్​తో బాధపడుతున్న ఆమె చివరి వరకు పోరాడి కన్నుమూశారు. రింకీ 2017లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. ఆ సమయంలో మానుషీ చిల్లర్ మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకున్నారు. 2022లో బ్రెస్ట్‌ క్యాన్సర్ బారినపడిన ఈమె, అప్పటి నుంచి ఈ వ్యాథికి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. అయితే క్యాన్సర్​ కాస్త ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. ఆమె చివరి వరకు పోరాడి కన్నుమూశారు. ఈ విషయాన్ని మిస్‌ఇండియా ఆర్గనైజేషన్‌ ధ్రువీకరించింది. రింకీ మృతి పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Spread the love

Related News

Latest News