ప్రతిపక్షం, స్పోర్ట్స్: టీమిండియా vs ఇంగ్లండ్ మధ్య జరగబోయే 5వ టెస్ట్ ఓ అరుదైన ఘటనకు వేదిక కానుంది. ధర్మశాల స్టేడియంలో మార్చి 7 నుండి 5వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇందులో అశ్విన్, జానీ బెయిర్‌స్టో ఇద్దరూ తమ 100 వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్ల ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో 100 వ టెస్ట్ ఆడటం ఇది 3వ సారి మాత్రమేనని క్రికట్ వర్గాలు పేర్కొన్నాయి.