కాషాయం కండువా కప్పుకున్న ఎంపీ బీబీ పాటిల్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్ తగులుతున్నాయి. షాక్‌లతో తల్లడిల్లుతున్న గులాబిబాస్ కేసీఆర్‌కు ఎంపీ బీబీ పాటిల్ షాకిచ్చారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. శుక్రవారం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి చేరారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా, గురువారం నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ఎంపీ బీబీ పాటిల్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి చేరారు.