ప్రతిపక్షం, అంతర్జాతీయం: ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌పై టెస్లా వ్వవస్థాపకుడు ఎలెన్ మస్క్ కేసు వేశారు. ఒప్పందాలను ఉల్లంఘించారని మస్క్ ఆరోపించారు. 2015లో సంస్థను స్థాపన కోసం ఆల్ట్ మన్, గ్రెగ్ నా సాయం కోరారు. ఇదో నాన్ ప్రాఫిట్ కంపెనీ అని, మానవాళి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తామని చెప్పడంతో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంస్థ లాభాల కోసం ప్రయత్నంచి కాంట్రాక్ట్‌ను ఉల్లంఘిస్తోందని మస్క్ పేర్కొన్నారు.