Trending Now

అయ్యో రామా.. నన్ను టార్గట్​ చేశారు : మాజీ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: అయ్యో రామా.. తెలంగాణ సర్కారు నన్ను టార్గెట్​ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ మంత్రి, మెడ్చేల్​ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నాపైనే కక్ష సాధింపు చేస్తోందని భగ్గుమన్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని, అయితే న్యాయంగా చేయాలన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామన్నారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా వేరే స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక పై మా కాలేజ్ వద్ద ట్రాఫిక్సమస్య విపరీతంగా పెరిగిపోతుందని మల్లారెడ్డి అన్నారు.

Spread the love

Related News

Latest News