Trending Now

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజూమున వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఐదుగురు అక్కడిక్కకడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బళ్లారి నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News