ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ సహకారం పూర్తిగా ఉంటుందని ప్రధాని మోదీ ఆదిలాబాద్ సభలో వెల్లడించారు. ”దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి.. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్ట్ లతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. రైలు, రోడ్డు కనెక్టివిటీ మరింత పెరుగుతోంది. పెద్ద ఎత్తున హైవేలను నిర్మిస్తున్నాం” అని మోదీ తెలిపారు.