ప్రతిపక్షం, వెబ్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ లోకి పడిపోవడంతో మొత్తం రాష్ట్రం గడ్డకట్టుకుపోయింది. గంటకు 72 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సేవలకు అంతరాయం కలగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుఫాన్ కారణంగా అనేక చోట్ల రహదారులను అధికారులు మూసేయడంతో మొత్తం రాష్ట్రం స్తంభిసంచింది.