Trending Now

ఫామ్‌హౌస్ మత్తులో ఉండి వారిని పట్టించుకోలేదు.. బీఆర్ఎప్ పై సీఎం రేవంత్ ఫైర్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం ఫామ్‌హౌస్ మత్తులో ఉండి నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోలేదని బీఆర్ఎప్ పై సీఎం రేవంత్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. తెలంగాణ సాధనలో నిరుద్యోగులు, యువత పాత్ర ఎంతో గొప్పదన్న రేవంత్.. విద్యార్థుల త్యాగాలు, బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. విద్య మీద పెట్టేదాన్ని ఖర్చుగా చూడకూడదు, పెట్టుబడిగా చూడాలని.. నేను కార్పొరేట్ స్కూల్‌లో చదువుకోలేదు, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివా.. గుంటూరు, గుడివాడలో చదువుకుని వచ్చినవాళ్లు, నాకు ఇంగ్లీష్‌ రాదని ఎగతాళి చేస్తున్నారన్నారు.

Spread the love

Related News

Latest News