ప్రతిపక్షం, వెబ్ డెస్క్: యూరప్‌లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్‌ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదవగా.. తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి.