హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో వార్తలకు ఎక్కుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని.. బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.