ప్రతిపక్షం, వెబ్ డెస్క్: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ ఎడిషన్‌లో130కి పైగా దేశాల అందాల భామలు పోటీపడగా.. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న టాప్ 20లో నిలిచారు. సినీ శెట్టి సొంత గడ్డపై ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు.
సినీ శెట్టి రేసులో ఉండడంతో మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌పై అందరి దృష్టి ఉంది. ప్రపంచ సుందరి ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. 2017లో మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు.