హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో:
కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యానించారు. వీహెచ్ త్వరలో జరిగే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తనకు సీటు రాకుండా భట్టి అడ్డు పడుతున్నారంటూ వీహెచ్ కన్నీరు పెట్టుకున్నారు.
హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూనే.. ఖమ్మం ఎంపీగా తనకు ఈసారైనా ఛాన్స్ ఇస్తే గెలుస్తానన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయకుండా తన పేరు లిస్ట్‌లో లేకుండా చేస్తున్నారని భట్టి పై ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారని..ముందుగా తనకు న్యాయం చేయాలని కోరారు. ఖమ్మం నుంచి రాహుల్ పోటీ చేస్తే తాను తప్పుకుంటానన్నారు. తాను పూర్తిగా ఎంపీగా పోటీకి అర్హుడినేనని చెప్పుకొచ్చారు