[t4b-ticker]

ఉపాధ్యాయుడు కీచకావతారం..!

విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన

ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలంటూ తల్లిదండ్రుల డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 31: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పా ల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిల పాలిట కీచకుడిగా మారాడు. తరగతి గదిలో బాలికలతో ద్వంద్వార్థపు మాటలు మాట్లాడుతూ, వారిని అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వెకిలి చేష్టలకు పాల్పడుతూ విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పదే పదే అతడు అలాగే ప్రవర్తిస్తుండడంతో భరించలేకపోయిన బాలికలు చివరకు పాఠశా లలోని ఇతర ఉపాధ్యాయులకు చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు. వారి సహాయంతో బాలల హెల్ప్న్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థి నుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ప్రత్యేక క్లాసుల పేరుతో విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే పరీక్షల్లో మార్కులు తగ్గిస్తానని బెదిరింపులకు దిగాడు. భయాందోళనకు గురైన బాధితులు చివరకు ధైర్యం చేసి తమ తల్లిదండ్రులకు విషయం తెలిపారు.

దాదాపు 20 రోజుల క్రితమే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినా.. బాలికలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో గోప్యత పాటిస్తున్నట్లు సమాచారం. అయితే బాలల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు పలు దఫాలుగా వివరాలు సేకరించినట్లు సమాచారం.విద్యార్థినుల ఫిర్యాదు మేరకు పాపన్నపేట జడ్పీ హైస్కూల్ సందర్శించి విచారణ జరిపినట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి (డీడబ్ల్యూవో) హేమభార్గవి తెలిపారు. బాలికలతోపాటు ఇతర ఉపాధ్యా యులు, పాఠశాల సిబ్బందితోనూ మాట్లాడి వివరాలు రాబట్టామని చెప్పారు. పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు మరోసారి సీడీపీవోను పంపినట్లు తెలిపారు. విచారణలో బాలికలు ఏం చెప్పార న్నది మాత్రం వెల్లడించలేదు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామన్నారు. అయితే పాఠశాలలో జరిగినట్లు చెబుతున్న ఈ వ్యవహా రాన్ని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థినులు చేసిన ఆరోపణలు అత్యంత సున్నితమైనవి కావడంతో ఎలాంటి పక్షపాతం, ఒత్తిళ్లకు తావు లేకుండా సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. ఇట్టి విషయమై జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారి స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు.​పాఠశాలల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News