ప్రతిపక్షం, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గ కేంద్రం లో 5 లక్షల తో నిర్మించే ఏకలవ్య మిత్ర మండలి భవన నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే పులివెందుల, కుప్పం మాదిరిగా సిద్దిపేట గౌరవాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు. సిద్దిపేటలో రాష్ట్రంలోనే ఆదర్శంగా కోటి రూపాయలతో ఏకలవ్య భవన్ ను నిర్మించుకున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాము. కానీ గవర్నర్ ఆమోదం రాలేదు. ఆమోదం ఇవ్వక పోవడాన్ని హైకోర్టు కరెక్ట్ కాదు అని తీర్పు కూడా ఇచ్చింది. భవిష్యత్ లో అన్ని విధాలా సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. మీ భవన నిర్మాణానికి నా పూర్తి సహకారం ఉంటుందన్నారు.