ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు దాదాపు 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 చోట్ల ఎన్ఐఏ నేడు చేస్తుంది. ఉగ్రవాదుల, గ్యాంగ్ స్టర్లతో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు ఈ భారీ ఆపరేషన్‌లో భాగం అయ్యాయి. ఉగ్రవాదం కేసు విచారణలో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.