ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ సహా మొత్తం 10 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఇప్పటికే విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య ఓ వందేభారత్ రైలు నడుస్తోంది. అయితే, వందే భారత్ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 5.05కు బయల్దేరి వరంగల్ 6.40, ఖమ్మం 7.45, విజయవాడ 9.10, రాజమండ్రి 11.02, సామర్లకోట 11.45, విశాఖపట్నం 1.50కు బయలుదేరుతుంది. ఒక్కో స్టేషన్‌లో నిమిషం మాత్రమే ఆగుతుంది. విజయవాడలో మాత్రమే ఐదు నిమిషాల హాల్ట్ ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఇందులో ఏడు ఏసీ ఛైర్ కోచ్‌లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఉంటాయి. ఈ రైలులో దాదాపు 530 మంది ప్రయాణం చేయొచ్చు. రేపటి నుంచి సేవలు ప్రారంభమవుతాయి.