ప్రతిపక్షం, హైదరాబాద్: కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ..15 కోట్లకు పైగా వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ రాహుల్ ను పోలీసులు పట్టుకున్నారు. కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ కొందరి నుంచి డబ్బు వసూలు చేశాడని ఆరోపణ. ఆయనపై ఇప్పటికే కీసన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యింది. తాజాగా దేశం వీడి వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు.