[t4b-ticker]

‎రూ. 200 కోట్లతో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి‎

  • ‎​రూ. 117 కోట్లకు అదనంగా మరో రూ. 80 కోట్లు మంజూరు చేసిన ప్రజా ప్రభుత్వం
  • ‎​వేకువజామున 2:58 గంటల శుభ ముహూర్తంలో భూమిపూజ, శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, సెప్టెంబర్ 07: దక్షిణ కాశీగా, పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భవిష్యత్తు సరికొత్త శోభను సంతరించుకోనుంది. దశాబ్దాలుగా భక్తులు, స్థానికులు కోరుకుంటున్న ఆలయాభివృద్ధి కల నెరవేరుస్తూ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం వేకువజామున 2:58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో రూ. 10 కోట్లతో చేపట్టిన శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు వైభవంగా భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.‎డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లు ఆలయంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి మంత్రోచ్ఛారణలతో వేదాశీర్వచనం గావించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం!

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… “మనందరికీ ఇష్టదైవమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాభివృద్ధిపై గతంలో చాలామంది మాటలు చెప్పారే తప్ప అర్ధరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రజా ప్రభుత్వం స్వామివారి దివ్యానుగ్రహంతో, ప్రజల ఆశీస్సులతో రూ. 117 కోట్లను ముందే మంజూరు చేసింది. స్థానిక శాసనసభ్యులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం అదనంగా నిధులు కోరగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గసూచనల మేరకు మరో రూ. 80 కోట్లను సాంక్షన్ చేశామని, మొత్తంగా రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాం” అని పేర్కొన్నారు. అదేవిధంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా గోదావరి నది ప్రవాహం వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

ఆలయంలో చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమాలు

రూ. 10 కోట్లతో శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం.‎​రూ. 58.55 కోట్లతో మొత్తం 9 రకాల మౌలిక వసతులు, ఆలయాభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన.రూ. 22.16 కోట్లతో పవిత్ర గోదావరి పుష్కరాల నిమిత్తం నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం.‎​రూ. 2.48 కోట్లతో ధర్మపురి మండలం తిమ్మపూర్ వద్ద నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.‎ప్రజా ప్రభుత్వం చొరవతో ప్రసిద్ధ ధర్మపురి పుణ్యక్షేత్రం రూ. 200 కోట్ల వ్యయంతో దివ్య ఆధ్యాత్మిక కేంత్రంగా మారబోతుండటం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News